ఇసుక కోసం వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు - ap latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12770424-727-12770424-1628928470714.jpg)
కృష్ణా జిల్లా నందిగామలో ఒక్కసారిగా పెరిగిన వరద కారణంగా.. నీటిలో 132 ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం వందకు పైగా లారీలు వెళ్లాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరదనీటికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవల ద్వారా డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు ఒడ్డుకు చేర్చారు.