'విశాఖ ఘటనపై అనేక మార్గాల్లో న్యాయ పోరాటం చేయొచ్చు' - ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ రావు కావేటి ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో పాలిమర్ కంపెనీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాస్ రావు కావేటి అన్నారు. విశాఖ దుర్ఘటనలో బాధితులకు పరిహారంతో పాటు అనేక న్యాయమార్గాల ద్వారా పోరాటం చేయవచ్చని ఆయన తెలిపారు. పర్యవేక్షణలో అలసత్వం వహించిన యంత్రాంగంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూనే బాధితులకు దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధుల చికిత్సకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. న్యాయవాద వృత్తిలో భారత్‌తో పాటు.. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో 30 ఏళ్ల సుధీర్ఘ అనుభవమున్న ఆయన ఈటీవీ భారత్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. ఎన్విరాన్మెంటల్ లాలో స్పెషలైజేషన్, భోపాల్ దుర్ఘటన సమయంలో పరిశోధన పత్రాన్ని సమర్పించిన న్యాయవాది శ్రీనివాస్‌రావు కావేటితో మా ప్రతినిథి ప్రవీణ్ ముఖాముఖి.