వైసీపీ శ్రేణుల అరాచకాలు- జగన్​కు మద్దతుగా లేడని ఆర్​ఎంపీ క్లినిక్​ దగ్ధం - RMP Clinic in Kancharlavaripalli burnt down

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 4:42 PM IST

Updated : Nov 5, 2023, 6:28 AM IST

YCP Activists Destroy RMP Clinic In Prakasam District: ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటూ బాధితులు మండిపడుతున్నారు. వైసీపీ అభిమానులు కనిగిరి మండలంలోని కంచర్లవారిపల్లి గ్రామంలో ఓ ఆర్​ఎంపీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌ను దగ్ధం చేశారు. అంతేకాకుండా క్లినిక్‌ గోడలపై జగన్‌ ఫ్యాన్స్‌ పేరిట పిచ్చి రాతలు రాశారు. ఆర్‌ఎంపీ వైద్యుడు అజయ్ వైసీపీ నాయకులకు అనుకూలముగా లేనందున.. గత రాత్రి ఆరోగ్య కేంద్రాన్ని మూసివేసి వెళ్లిన సమయంలో కేంద్రం తాళాలు పగల కొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు అందులో ఉన్న సామాగ్రితో పాటు వివిధ రకాల ఔషధాలను, మాత్రలను దగ్ధం చేశారు. అంతే కాకుండా ఆగంతకులు కేంద్రం వెలుపల గోడపై.. తెల్లగా ఉంటాయి పాలు జగనన్న ఫ్యాన్స్​తో పెట్టుకుంటే లేస్తాయి గాల్లో శవాలు అంటూ.. జై జగన్ అనే పలు రకాల పిచ్చి రాతలు రాసి కింది భాగాన ఓ ఫోన్ నెంబర్ కూడా రాయడాన్ని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ప్రధమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆర్ఎంపి వైద్యుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

Last Updated : Nov 5, 2023, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.