Water in Secretariat building: శాశ్వత సచివాలయ పునాదుల్లోకి నీరు.. ఆలస్యంగా తేరుకున్న అధికారులు - అమరావతిలోని శాశ్వత సచివాలయం చిత్రాలు
🎬 Watch Now: Feature Video
Water in Secretariat Building foundations: తాజాగా రాజధాని అమరావతిలోని శాశ్వత సచివాలయ పునాదుల్లోకి నీరు చేరింది. ఈ నీటిని తొలగించేందుకు గుత్తేదారు శ్రమిస్తున్నారు. అమరావతిలో శాశ్వత సచివాలయం కోసం గత ప్రభుత్వం 5 టవర్ల నిర్మాణం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు పునాదుల స్థాయిలోనే నిలిచిపోయాయి. దీంతో ఆదిలోనే ఉన్న నిర్మాణాలు ఎప్పటి నుంచో నీటిలో నానుతున్నాయి. ఇటీవల వర్షాలకు వాటిలోకి భారీగా వరద చేరింది. పిల్లర్ల కోసం వేసిన ఇనుప చువ్వలూ పూర్తిగా మునిగిపోయాయి. అలాగే వదిలేస్తే చువ్వలు తుప్పు పట్టిపోతాయని భావించిన సీఆర్డీఏ అధికారులు... నీటిని తోడాలని గుత్తేదారుకు సూచించారు. దీంతో మోటార్లతో నీటిని తోడేశారు. ఈ పునాదులపైన 40 నుంచి 50 అంతస్తుల్లో సచివాలయ భవనాలు నిర్మించాల్సి ఉంది. వీటిని రక్షించుకుంటేనే రేపటి నిర్మాణాలు మన్నికగా ఉంటాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా, ప్రభుత్వ కార్యాలయాలు.. తదితర అవసరాల కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కార్యాలయాల ఏర్పాటుకు తగిన నిధులను సైతం కేటాయించింది. అధికారం మారడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రాజధాని మార్పు అంశం వల్ల ఆయా ప్రాంతాల్లో కట్టడాలకు సంబంధించిన పనులు నిలిచిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.