ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం..
🎬 Watch Now: Feature Video
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా రేపు (బుధవారం) రాత్రి సీతారాముల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శాశ్వత కల్యాణ వేదికలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ఆలయ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కల్యాణాన్ని పున్నమి చంద్రుడు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఈ కల్యాణోత్సవాలు జరుగుతాయి. స్వామివారి కల్యాణోత్సవానికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో.. భారీ ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒంటిమిట్టకు చేరుకుని స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేస్తారు. కానీ రాత్రి కల్యాణోత్సవాన్ని తిలకించకుండానే సీఎం ఒంటిమిట్ట నుంచి సాయంత్రమే తిరిగి వెళ్లనున్నట్లు సమాచారం. ఒంటిమిట్ట కల్యాణ వేదిక నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి మురళీ మరింత సమాచారం అందిస్తారు.