Visakha Police Solve The Theft Case: ఘరానా దొంగ, అతని తల్లి అరెస్టు - AP TOP NEWS TODAY
🎬 Watch Now: Feature Video

Visakha Police Solve The Theft Case:విశాఖలో ఘరానా దొంగను, అతనితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఘరానా దొంగ తల్లి ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున 3 గంటల సమయంలో దొంగతనం జరిగింది. డాక్టర్ సూర్య సాహిత్య అనే మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సీలా అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘరానా దొంగ పట్టుబడటంతో అతని గురించి విస్తుపోయే నిజాయి బయటకు వచ్చాయి. ప్రతీ రోజు రాత్రి సమయంలో శివారు ప్రాంతాల్లో తిరుగుతుంటాడని. ఉదయం సమయంలో సినిమా థియేటర్లలో పడుకుంటాడని పోలీసులు తెలిపారు.
సీలా అనిల్ కుమార్ 45 కేసులలో నిందితుడిగా ఉన్నాడని, 14 కేసులలో శిక్ష పడిందని, ఇతనిపై వివిధ జిల్లాల్లో, పలు రాష్ట్రాల్లో దొంగతనం కేసులు ఉన్నాయని విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఇతను చోరీ చేయడానికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశామని, అరెస్టు అయిన వారిలో ఇతని తల్లి కూడా ఉందని చెప్పారు. 5,80,000 రూపాయల విలువ చేసే బంగారం, వెండీ స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.