Tribal Youth Protest in Nagavali River: "ఆంధ్రా వద్దు.. ఒడిశా ముద్దు.. మా గ్రామాల్ని ఒడిశాలో కలపాలి" నాగావళి నదిలో యువకుల నిరసన
🎬 Watch Now: Feature Video
Tribal Youth Protest in Nagavali River: "ఆంధ్రా వద్దు.. ఒడిశా ముద్దు" అంటూ పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని ఉన్న నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న రెబ్బ గిరిజన గ్రామస్థులు నిరసన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వ పని తీరుతో విసిగిపోయిన గిరిజనులు.. తమను ఒడిశాలో కలపాలని (Tribal Youths Protest Against AP Government At AOB) నినదించారు. జిల్లాలోని కొమరాడ మండలం రెబ్బ, వనధార గ్రామాల యువత నాగావళి నదిలోకి దిగి ఆందోళన చేశారు. "గిరిజనుల ప్రాణాలకు విలువ లేదా.. ఆంధ్రా వద్దు ఒడిశా ముద్దంటూ" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి రోజూ నాగావళి నదిని దాటేందుకు తామెంతో ఇబ్బంది పడుతున్నామని.. ప్రభుత్వం కనీసం మరబోటు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఒడిశాలో కలపాలంటూ నినాదాలు చేశారు. విద్య, వైద్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి నాగావళిని దాటుతున్నామని వారు ఆవేదన చెందారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదని గిరిజన యువకులు వాపోయారు.