Telugu Language Day Sand Sculpture : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా.. సందేశాత్మకంగా సైకత శిల్పం.. - ఏపీ సైకత శిల్పం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-08-2023/640-480-19382703-thumbnail-16x9-sand-art.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 1:58 PM IST
Telugu Language Day Sand Sculpture : ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరిజిల్లా రంగంపేటలో రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఈ శిల్పాన్ని ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యతలు తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామస్థులు వస్తున్నారు.
ఎన్ని భాషలైన నేర్చుకో.. అమ్మ భాషను అక్కున చేర్చుకో.. అనే నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. అలానే తెలుగు వ్యవహరిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులున్ని స్మరించుకుంటూ.. ఆయన చిత్రాన్ని రూపొందించారు. మరో పక్క తెలుగు భాష కోసం ‘అ’ అనే అక్షరం ఏడుస్తున్నట్టుగా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రముఖ సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్ ఆవేదనతో తెలుగు భాషపై రచించిన పాట తెలుగు ఎక్కడ ఉందిరా.. తెలుగోడా అనే పాటను ఈ సందర్భంగా సోహిత, ధన్యతలు పాడి వినిపించారు. తెలుగు ప్రజలందరూ మాతృభాషైన తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పారు.