TDP Leader Somireddy Harsh Comments on CM Jagan: శిశుపాలుడివి వంద తప్పులైతే జగన్‌వి వెయ్యి తప్పులు : సోమిరెడ్డి - TDP Leader Somireddy news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 14, 2023, 12:39 PM IST
TDP Leader Somireddy Harsh Comments on CM Jagan: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పట్ల సీఎం జగన్, వైఎస్సార్సీపీ మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలపై.. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే ముఖ్యమంత్రి జగన్ వెయ్యి తప్పులు చేశారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల రామకృష్ణారెడ్డివి నీచమైన మాటలంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్, సజ్జల ఫ్యాక్షన్ పాలనలో ఎంతమంది అనాథలయ్యారో అందరికీ తెలుసంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Somireddy Comments: ''కడప, రాయలసీమలో మీ ఫ్యాక్షన్ పాలన వల్ల ఎంతమంది బలయ్యారో అందరికీ తెలుసు. అలాంటి చరిత్ర మా పార్టీకి ఉందా..? లేదే..? మీ అభిమాని మీకు సానుభూతి రావాలని చిన్న పిన్నుతో గుచ్చినందుకు నాలుగున్నరేళ్లుగా అతడిని జైళ్లో పెట్టి నానా తిప్పలు పెడుతున్నారు. హత్యలు చేసినవాళ్లేమో బయట తిరుగుతున్నారు. నాలుగేళ్లుగా ప్రజల సొమ్మును దోచుకున్నారు. పైనా శ్రీకృష్ణుడు ఉన్నాడు. త్వరలోనే సమాధానం చెప్తాడు.'' అని సోమిరెడ్డి అన్నారు.