తుపానుపై ప్రభుత్వం నిర్లక్ష్యం - జగన్ రైతులను నిండా ముంచారు: పట్టాభి - సీఎం జగన్ పై టీడీపీ నేత ఫైర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 6:56 PM IST
TDP Leader Pattabhi Ram Fires on YCP Govt: తుపానుపై ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్లే పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మండిపడ్డారు. తుపానుపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. చేతికి అందాల్సిన పంట పూర్తిగా పోయి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని అన్నారు. సన్నద్ధత లేకనే పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని పట్టాభి దుయ్యబట్టారు. రైతు పక్షపాతినని చెబుతూనే వారిని నిండాముంచారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు బాబు పాలనలో పంటల బీమా క్లెయిమ్ రేషియో ఏపీలో ఎక్కువ ఉండేదని పట్టాభి తెలిపారు. రైతుల ప్రభుత్వం అంటే చంద్రబాబు పాలన అని పట్టాభి అన్నారు. రైతులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చర్యలతో నెంబర్‌వన్ స్థానం నుంచి అట్టడుగుకు పడిపోయామని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లలో పంటల బీమా కింద ఎంత చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.