Students Performing Mallakhamb Sport : స్వాతంత్య్ర దినోత్సవాల్లో కోనసీమ విద్యార్థుల ప్రతిభ.. అధికారుల ప్రశంసల జల్లు - అమలాపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Students Performing Mallakhamb Sport in Amalapuram: ఆగస్టు 15 పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఆకాశాన్నంటాయి. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఓ క్రీడను కోనసీమ కుర్రోళ్ళు ప్రదర్శించారు. ఆ కుర్రోళ్ళు ప్రదర్శించిన క్రీడను వీక్షించిన వారు అభినందనలు, ప్రశంశల వర్షం కురిపించారు. అసలు వాళ్లు ఏ క్రీడ చేశారో తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గుడిమల్లంక ఉన్నత పాఠశాల విద్యార్థులు మహారాష్ట్రకు చెందిన మల్లాఖంబ్ అనే క్రీడను ప్రదర్శించారు. ఒక కర్ర మీద వేలాడుతూ రకరకాల విన్యాసాలు ప్రదర్శించి అందరి మెప్పును చూరగొన్నారు. కర్రపై చకచకా ఎగబాగుతూ కిందకు దిగుతూ వివిధ భంగిమలలో ఆసనాలు వేశారు. ఈ క్రీడ వీక్షకులను కట్టిపడేసింది. వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను అధికారులు ప్రశంసించారు. వేడుకను వీక్షించిన వారంతా విద్యార్థులను అభినందించి, ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంస శుక్ల, మంత్రి జోగి రమేశ్ పాల్గొన్నారు.