ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం.. పరుగులు తీసిన రోగులు - ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి
🎬 Watch Now: Feature Video
Snake in Hospital కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం రేపింది. ఆసుపత్రి ఎక్స్రే గదిలో పామును చూసిన వైద్యులు, సిబ్బందితోపాటు.. రోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి.. దాన్ని పట్టుకొని బయట వదిలారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ 300 మంది ఓపీ కోసం వస్తుంటారు. అలాగే ప్రసవాల కోసం మహిళలు ఆసుపత్రిలో చేరుతుంటారు. ఇంతగా జనసంచారం ఉండే ఆసుపత్రి పక్కనే ముళ్లపొదలు పెరిగిపోయాయి. అక్కడ పాములతోపాటు ఇతర విషపురుగులు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST