Chirala Police Conducted Seemantham: మహిళా కానిస్టేబుల్​కు పోలీస్​ స్టేషన్​లో సీమంతం.. సోదర భావం చాటిన సిబ్బంది - బాపట్ల జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2023, 3:04 PM IST

Seemantham Conducted In Police Station: తమ వద్ద పనిచేస్తున్న ఓ మహిళ్ కానిస్టేబుల్​కు తోటి సిబ్బంది స్టేషన్ అవరణలో సీమంతం జరిపించి సోదర భావాన్ని చాటిన సంఘటన బాపట్ల జిల్లాలోని చీరాలలో జరిగింది. చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో కల్యాణీ అనే మహిళ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె సీమంతాన్ని పోలీస్​ స్టేషన్​లో చేయాలని కల్యాణితో పనిచేసే తోటి సిబ్బంది భావించారు. వారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసి ఆమె సీమంతం వేడుకను పోలీస్​ స్టేషన్​లో ఘనంగా నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ కల్యాణికి పసుపు, కుంకుమలు అందజేసి ఆమెను ఆశీర్వదించారు. ఈసందర్భంగా మాట్లాడిన బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ ప్రసాదరావు... పోలీసులు అందరూ ఒకే కుటుంబం అని అనటానికి ఈ కార్యక్రమమే ఓ నిదర్శనం అని అన్నారు. తోటి పోలీసుల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం వారితో పనిచేసే వాళ్ల బాధ్యత అని డీఎస్పీ ప్రసాదరావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.