'కర్ణాటక టు అనంతపురం' సినిమాలో ట్రైన్ సీన్ తలపించేలా మద్యం రవాణా - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
🎬 Watch Now: Feature Video
SEB Raid on Karnataka Liquor Smuggling in Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB) అధికారులు దాడులు నిర్వహించారు. కసాపురం వద్ద హంద్రీనీవా కాలువ సమీపంలో ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 బాక్సులలో ఉన్న కర్ణాటక మద్యంను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు.
SEB Officials Seize Liquor :మద్యం అక్రమ రవాణా దారులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో గిలక సుగుర్ అనే ప్రాంతంలో మద్యాన్ని కొనుగోలు చేసి వాటిని మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్దకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఖాళీగా వస్తున్న గూడ్స్ రైళ్లలో ఈ మద్యాన్ని డంపింగ్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఇలా గూడ్స్ రైళ్లలో తీసుకొస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లాలోని నంచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైళ్లకి వ్యాక్యూమ్ బ్రేక్ ద్వారా ట్రైన్‌ను ఆపి వేసి మద్యం బాక్సులను దింపుకుంటున్నారన్నారు. అనంతరం దానిని ఆటోలలో రోడ్డు మార్గం ద్వారా అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ విధంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్న సమయంలో అనంతపురం జిల్లా సబ్ అధికారులు మెరుపు దాడి నిర్వహించి ఈ మొత్తం అక్రమ రవాణా దందాని బట్టబయలు చేశారు. మద్యం అక్రమ రవాణా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.