నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నాగ సాధువు వ్యక్తి హల్చల్ - Anakaplly District news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 1:15 PM IST
Naga Sadhu Halchal in Narsipatnam RDO Office: అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో నాగసాధువు వేషంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సదరు సిబ్బందిని బెదిరించి కార్యాలయంలోకి ప్రవేశించిన అతను నానా హంగామా చేశాడు. అనంతరం నగదు కావాలని డిమాండ్ చేయడంతో, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంట్రీతో నాగసాధువు వేషంలో ఉన్న వ్యక్తి కథ ముగిసింది.
అసలేం జరిగిందంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నాగ సాధువు వేషంలో ఉన్న వ్యక్తి నానా హైరానా చేశాడు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి కార్యాలయంలోకి ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. కంప్యూటర్ ముందు కూర్చుని తెగ హడావిడి చేశాడు. శరీరంపై వస్త్రాలేవీ సరిగా లేని అతను ప్రభుత్వ కార్యాలయాలకు ప్రవేశించడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కుర్చీలో కూర్చోని కంటి అద్దాలు తీస్తూ పెడుతూ సినీనటుడి స్థాయిలో వ్యవహరించాడు. కొంత సమయం తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ సిబ్బందిని బెదిరించి నానా రాద్దాంతం చేశాడని సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమి లేక సిబ్బంది నర్సీపట్నం పోలీసులను ఆశ్రయించగా అతని వివాదం సద్దుమణిగింది.