GVMC workers strike హామీల అమలులో జాప్యం.. సోమవారం నుంచి సమ్మెకు వెళ్తున్నాం: జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు - Municipal workers strike in Visakhapatnam
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2023/640-480-18777386-875-18777386-1686998769081.jpg)
GVMC contract workers strike: మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చూపిన నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చామని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. ఇదే సమయంలో అధికారులతో చర్చలు ఉన్నాయని.. అవి సఫలం అయితే తమ డిమాండ్ ఇక్కడే పరిష్కరించి జీవీఎంసీ కౌన్సిల్లో ఆమోదించి అమలు చేస్తే తాము నిరవధిక సమ్మెను విరమిస్తామని తెలిపారు. గతంలో ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించకపోతే ఊరుకునేది లేదని తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస మౌలిక అంశాలను కూడా పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. ఈ విషయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత చాటి చెప్పే విధంగా తాము ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని వివరించారు. అదనంగా పని చేయడానికి మున్సిపల్ వర్కర్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారని అలాగని డిమాండ్లు నెరవేర్చినట్టయితే సమ్మె విరమించుకుంటామని స్పష్టం చేశారు.