కుటుంబ వ్యవహారాల్లో ఎమ్మెల్యే, అధికారుల జోక్యం - న్యాయం కోసం తండ్రీకొడుకుల దీక్ష - prakasam political news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-12-2023/640-480-20315002-thumbnail-16x9-mla-interference-family-affairs.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 5:40 PM IST
MLA and Officials Interference in Family Affairs : ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి తమను వేధిస్తున్నారంటూ తండ్రి, కొడుకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. మార్కాపురం మండలం బిరుదులనరవకు చెందిన విశ్రాంత వీఆర్వో మునిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉమ్మడి ఆస్తులపై వివాదం నడుస్తోంది. పోలీసులు ఇరువురిని బైండోవర్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పొలంలోకి వెళ్లొందని సూచించారు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి జోక్యం చేసుకుని రెవెన్యూ అధికారులు, పోలీసులతో తమను వేధిస్తున్నారని మునిరెడ్డి ఆరోపించారు.
Victim Concern : తమ కుటుంబ వ్యవహారాల్లోకి ఎమ్మెల్యే, పోలీసులు అధికారులు జోక్యం చేసుకొని తనని బెదిరిస్తున్నారని విశ్రాంత వీఆర్వో మునిరెడ్డి పేర్కొన్నారు. తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోమని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగి ఫలితం లేదని వాపోయారు. ఈ విషయంలో పై అధికారులు జోక్యం చేసుకొని తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవల్సిందిగా కోరారు.