Martin Luther King Movie Team at Vijayawada: విజయవాడలో 'మార్టిన్ లూథర్ కింగ్' సందడి.. ప్రేక్షకులను పలకరించిన చిత్ర బృందం - ఎన్టీఆర్ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 12:15 PM IST
Martin Luther King Movie Team at Vijayawada: మార్టిన్ లూథర్ కింగ్ మూవీ టీం విజయవాడలో సందడి చేసింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆ సినిమా కథానాయకుడు సంపూర్ణేష్ బాబుతో పాటు దర్శకులు పూజ, వెంకటేష్ మహా విజయవాడలోని ఎల్ఈపీఎల్ ఐనోక్స్ థియేటర్‌కి వచ్చారు. అభిమానులతో కలిసి ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన అనంతరం.. మూవీపై వాళ్ల అభిప్రాయాలను చిత్ర బృందం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
మార్టిన్ లూథర్ కింగ్ సినిమా.. రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ తగట్టుగా తెరకెక్కించినట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యత గురించి యువతకు, ప్రజలకు చాటి చెప్పే విధంగా చక్కటి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మూవీ టీం పేర్కొంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.