Lokesh fire on CM Jagan in Padayatra: ముఖ్యమంత్రి జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ.. సాగునీటి ప్రాజెక్టులపై లేదు: నారా లోకేశ్ - Yuvagalam Padayatra today news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2023, 3:47 PM IST

Updated : Aug 2, 2023, 3:59 PM IST

TDP youth leader Nara Lokesh Yuvagalam padayatra Updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర గత 172 రోజులుగా అనేక సవాళ్లను, ఆంక్షలను ఆధికమిస్తూ.. విజయవంతంగా కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేశ్.. ప్రజలతో, యువతతో, వివిధ వర్గాల వారితో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం ఆ సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 172 రోజులు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర ఈరోజుతో 173వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్రను యువనేత పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గుర్రప్పనాయుడుపాలెం నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో ఉప్పలపాడు, చాట్రగడ్డపాడు గ్రామాల్లో స్థానిక ప్రజలను కలిసిన లోకేశ్.. వారి సమస్యలను వినతిపత్రాల రూపంలో తెలుసుకున్నారు.

జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదు.. నారా లోకేశ్ మాట్లాడుతూ..''ముఖ్యమంత్రి జగన్‌కు దోపిడీపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో లేదు. టీడీపీ హయాంలో నీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చుచేస్తే.. జగన్ పాలనలో అందులో నాలుగోవంతు కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు కరెంట్‌ బిల్లులు కూడా చెల్లించకుండా ప్రభుత్వం మూలనపడేసింది.'' అని దుయ్యబట్టారు. ఈరోజు (బుధవారం) పాదయాత్రలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబులు పాల్గొన్నారు.

''ఒక్క అవకాశమంటూ జగన్ అందర్నీ మోసం చేశారు. చివరకూ పోలీసులను కూడా మోసం చేశారు. రాత్రింబవళ్లు జగన్‌కు రక్షణగా ఉంటున్న పోలీస్‌ శాఖలో ఈ జగన్ అలవెన్సుల్లో కోతలు విధించారు. అలవెన్స్‌ల్లో కోత విధించడమే కాకుండా.. జీవో నంబరు 79ని తీసుకురావడం దారుణం. పోలీసుల సొమ్మును కూడా ఈ జగన్ ప్రభుత్వం దోచుకుంటుంది. గతంలో పోలీసులు దాచుకున్న రూ.800 కోట్ల పీఎఫ్‌ను కూడా దారి మళ్లించారు. దిశ సిబ్బంది అలవెన్సులను పూర్తిగా తొలగించారు. వైసీపీ పాలనలో ఏ వర్గంవారు సంతోషంగా లేరు. సీఎం జగన్ మోసాలను అన్ని వర్గాల ప్రజలు గ్రహిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు త్వరలోనే తాళాలు వేసే పరిస్థితి వస్తుంది.''-పత్తిపాటి పుల్లారావు, టీడీపీ మాజీ మంత్రి

Last Updated : Aug 2, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.