Kalanjali Pattu Sarees Fashion Show in Vijayawada: సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కళాంజలి ఫ్యాషన్‌ షో - శారద కాలేజ్ ఫ్రెషర్స్ డే

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 4:18 PM IST

Kalanjali Pattu Sarees Fashion Show in Vijayawada: ఏకరూప దుస్తుల్లో కనిపించే విద్యార్ధినులు.. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కళాంజలి పట్టుచీరలు ధరించి నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. శారద కళాశాల ఫ్రెషర్స్​ డే వేడుకలు శనివారం విజయవాడ లబ్బిపేటలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాంజలి కంచి, ఆరణి, బెనారస్ డిజైనర్ పట్టుచీరలను విద్యార్థినులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేసి హొయలొలికించారు. విడివిడిగా, జంటగా, బృందంగా ప్రదర్శనలిస్తూ కనువిందు చేశారు. విద్యార్థుల సంప్రదాయ, శాస్త్రీయ నృత్యాలు చేసి అలరించారు. సినిమా పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. దీంతో ఆ ప్రాంగణం అంతా సందడిగా నెలకొంది. దేశాభివృద్ధి చెందాలంటే ముందు మనం మారుతూ, సమాజాన్ని మార్చాలని వక్తలు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్తును రూపొందించే కేంద్రాలుగా ఉన్న కళాశాలలను ప్రతి విద్యార్ధి సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు సేవాభావం, నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసాన్ని అలవరచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.