సామాజిక పింఛన్లు నిలిపేస్తే రహదారులను అద్దంలా తీర్చిదిద్దొచ్చు : వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి - Kadiri MLA Sidda Reddy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 1:45 PM IST
Kadiri MLA Sidda Reddy Comments on Roads : ఆ వైసీపీ ఎమ్మెల్యేను సమస్యలను పరిష్కరించమని ఎవరైనా అడిగితే శివాలెత్తపోవడం కొంతకాలంగా సంప్రదాయంగా వస్తోంది. గతంలో ఓ యువకుడు తమ గ్రామంలో రోడ్లు బాగేలేవని ప్రశ్నించగా.. ఒంటి కాలితో యువకుడిపై విరుచుకుపడ్డారు. ఆ సంఘటన మరువక మందే రహదారిని బాగు చేయండని గ్రామస్థులు ఎమ్మెల్యేను సంప్రదించారు. అంతే ఆయన వ్యవహరించిన తీరు బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా ఉందని విస్తుపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Roads Can Be Built if Social Pensions are Stopped : శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి గ్రామస్థులు తమ గ్రామ రహదారి అధ్వానంగా మారిందని, బాగు చేయాలని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పెన్షన్ల కోసం 15 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే.. రోడ్లన్నీ అద్దంలా తీర్చిదిద్దొచ్చని అన్నారు. దీంతో చేసేది ఏమీ లేక వారు నిరుత్సాహంగా వెనుదిరిగారు. గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్లు ఇవ్వనట్టు, ఈ ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తీరు ఉందంటూ.. పెన్షన్లకు రోడ్డు అభివృద్ధి పనులకు లింకు పెడుతూ మాట్లాడడం ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Roads Situation : ఇటీవల కాలంలో జిల్లాలోని కదిరి మండలం పట్నం పంచాయతీలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రహదారి విషయంలో ఓ యువకుడిపై నోరు పారేసుకున్నారు. రోడ్లన్నీ తామే వేశామని, ఐదు సంవత్సరాల పాటు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ యువకుడిపై చిందులేయడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.