Janasena Song on CM Jagan: చేసినాము పొరపాటు.. దించినావు పెద్దపోటు..! జగన్ పాలనపై మరో పాట విడుదల చేసిన జనసేనాని - సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పాటలు
🎬 Watch Now: Feature Video
Janasena Song on CM Jagan: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలు.. ప్రస్తుతం వాటి పరిస్థితి వివరించేలా పాట సాగుతుంది. సారు.. ఓ సీఎం సారు అంటూ ప్రజలు జగన్ పాలనపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో పాట రూపొందించారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడే ఈ వీడియో గీతాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా అంతకు ముందు కూడా వైసీపీ పాలనపై జనసేన పాటల్ని విడుదల చేసింది. కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె అనే పాట ద్వారా ఏపీ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వ అకృత్యాలు, అసమర్థతను ఎండగడుతూ.. మహిళలు అంతా ఏకమై ఈ ప్రభుత్వ తప్పులను ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సింగర్స్ మధుప్రియ, నల్గొండ గద్దర్ ఇటీవల ఓ పాటను పాడారు. దానికి జనసేన విడుదల చేసింది.