Janasena fire on Vasireddy Padma: "వాసిరెడ్డి పద్మ వైసీపీ కార్యకర్తలా మాట్లాడటం సరికాదు" - Gade on women commission chairperson

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2023, 3:34 PM IST

Janasena Leader Gade Venkateswara Rao Fire on Vasireddy Padma: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలను గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఖండించారు. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్​పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన లెక్కల గురించి పవన్ ట్వీట్​ చేస్తే.. వాసిరెడ్డి పద్మ అలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. కేబినెట్ హోదా పదవిలో ఉన్న వారిలా కాకుండా.. వైసీపీ కార్యకర్తలా మాట్లాడటం వాసిరెడ్డి పద్మకే చెల్లిందన్నారు. ఆది లేదా సోమవారాల్లో జనసేన వీర మహిళలు వాసిరెడ్డి పద్మకు సమాధానం చెబుతారని హెచ్చరించారు.

బడి పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ పేరుతో సీఎం జగన్‌ వందల కోట్లు కొట్టేశారని.. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. బైజూస్ స్కాంలో జగన్ పాత్ర ఎవరి ఆలోచనకూ అందదన్నారు. 8వ తరగతి పిల్లల విషయంలోనే 167 కోట్ల రూపాయల అవినీతి చేసిన వ్యక్తి... ఇక మిగతా ప్రజల విషయంలో ఎలా ఉంటారో ఆలోచించాలన్నారు. స్కీంల పేరిట స్కాం చేయటం వైకాపాకు అలవాటేనని ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.