Government Employee Romance in Office:ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారి రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో - Government Employee Romance in atmakur
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2023, 1:09 PM IST
Government Employee Romance in Office: ఓ అధికారి తాను పని చేసే ప్రభుత్వ కార్యాలయాన్నే అడ్డాగా చేసుకుని రాసలీలలకు పాల్పడ్డారు. అయితే ఆ అధికారి రాసలీలలను కొందరు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి రాసలీలల వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. కార్యాలయంలో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో నాలుగు రోజుల కిందట కలెక్టరేట్ నుంచి కమిషనరు మెయిల్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ వీడియో ఆధారంగా కమిషనరు శ్రీనివాసరావు ఆ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానికి సమాధానంగా ఆ వీడియోలో ఉన్నది తానేనని ఉన్నది. ఆమె తన బందువేనని అంగీకరించినట్లు కమిషనరు వెల్లడించారు. ఆ యువతికి పురపాలక కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యాలయంలో రాసలీలలు సాగించడం తప్పని హెచ్చరించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం మరో వీడియో బహిర్గతమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి పదోన్నతిపై బదిలీ రావడంతో ఆత్మకూరులో విధుల నుంచి రిలీవ్ చేశారు.
TAGGED:
Employee Romance in Office