Fraud in the Name of Chief Minister Relief Fund: రోగుల్లేకుండా.. చికిత్స చేయకుండా..! వైఎస్సార్ ఆసుపత్రి కేంద్రంగా.. సీఎంఆర్ఎఫ్ స్వాహా - CMRF scam in Andhra Pradesh
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 12:22 PM IST
Fraud in the name of Chief Minister Relief Fund : ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేరిట మోసం జరిగినట్లు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతపురంలోని వైఎస్సార్ మెమోరియల్ ఆసుపత్రి (YSR Memorial Hospital) కేంద్రంగా మోసం జరిగినట్లు తేలింది. అక్కడ పని చేసే ఉద్యోగి వేర్వేరు పేర్లతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసి నిధులు కాజేశాడు. అసలు రోగులను చేర్చుకోకుండా, ఎలాంటి చికిత్స చేయకుండానే ఈ మోసాలకు పాల్పడ్డాడు. Chief Minister's Relief Fund (CMRF) అధికారుల విచారణలో మోసం బట్టబయలైంది.
CMRF scam in Andhra Pradesh : వెంటనే అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్కు పంపించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని పోలీసులు విచారణ చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం ప్రమేయం లేకుండా ఇంత భారీ మోసం సాధ్యం కాదని.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.