కోవిడ్​పై జాగ్రత్త వహించాలన్న వైద్యారోగ్యశాఖ- రోజుకు వెయ్యి పరీక్షలు నిర్వహించేలా ఆర్టీపీసీఆర్ సెంటర్లు - కోవిడ్​పై జాగ్రత్త వహించాలన్న వైద్యారోగ్యశాఖ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 9:29 AM IST

Emergence Of Covid Cases Health Department Issued People Alert: కేరళతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు వెలుగు చూసిన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచనలు జారీ చేసింది. ఫ్లూతో కూడిన జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి టి.కృష్ణబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా సూచనలు చేశారు.

Instructions Are Issued To Prepare RTPCR Centers: రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా ఆర్టీపీసీఆర్ సెంటర్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ క్లీనిక్​లోనూ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఫ్లూ జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేయాల్సిందిగా ఆయన అధికారులకు సూచించారు. వీటితో పాటు చేతి గ్లౌజెస్, మాస్కులు, శానిటైజర్లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. అదే సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డిటైప్ సిలెండర్లు ఆస్పత్రుల్లో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. జ్వరం దగ్గు లాంటి లక్షణాలు కన్పించిన వ్యక్తులు స్వీయ ఏకాంతాన్ని పాటించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించినా విలేజ్ క్లీనిక్​లో తప్పకుండా పరీక్షలు చేయించుకుని సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.