వ్యాయామం చేస్తూ సీఎం సెక్యూరిటీ విభాగం కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి - Constable Died in mangalagiri

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 3:49 PM IST

Updated : Dec 2, 2023, 3:55 PM IST

Constable in Octopus Force Died of Heart Attack: గుంటూరు జిల్లా ఆక్టోపస్ దళం(Octopus Force)లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న సోమేశ్వరరావు(31) ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం మంగళగిరి 6వ బెటాలియన్(betallion)​లో ఆక్టోపస్ సిబ్బందికి 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీ అనంతరం సిబ్బందితో కలిసి వ్యాయామం(Exercise) చేస్తుండగా సోమేశ్వరరావు గుండెపోటు(Heart Attack)కి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన పక్కనే ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సోమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సోమేశ్వరరావు మృతదేహాన్ని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Colleagues Become Emotional due to Death of Someshwarao: సోమేశ్వరరావు మృతదేహాన్ని చూసిన తోటి సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోమేశ్వర రావు సీఎం సెక్యూరిటీతోపాటు ఇతర విభాగాల్లోనూ పనిచేస్తున్నారని తోటి సిబ్బంది తెలిపారు. సోమేశ్వర మృతదేహాన్ని అంబులెన్స్​లో శ్రీకాకుళానికి తరలించారు. 

Last Updated : Dec 2, 2023, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.