పార్వతీపురంలో వైఎస్సార్సీపీ-టీడీపీ కౌన్సిలర్లు బాహాబాహి - పోలీసుస్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు - political news tdp
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 7:17 PM IST
Clash Between YCP and TDP Councilors in Parvathipuram District : పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గౌరీశ్వర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పట్టణంలో జరిగిన అభివృద్ధిపై 8వ వార్డు కౌన్సిలర్ నారాయణరావు ఎమ్మెల్యేను నిలదీశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా 25వ వార్డు వైసీపీ కౌన్సిలర్ సుధీర్ నారాయణరావుతో వాగ్వాదానికి దిగారు.
Both Parties Complained to Police : వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమావేశంలో జరిగిన వాగ్వాదం గురించి తెలుసుకున్న సుధీర్ వర్గీయులు కార్యాలయం బయట నారాయణరావుపై దాడి చేశారు. కౌన్సిలర్లు అడ్డుకుందుకు స్థానికులు ప్రయత్నం చేసినా వారి మధ్య వాగ్వాదం ఆగలేదు. అనంతరం ఇరువర్గాలు స్థానిక పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు.