అంగన్వాడీలను తెరిపించండంటూ చిన్నారు వేడుకోలు- పోషకాహారం అందడం లేదని ఆవేదన - అంగన్వాడీ చిన్నారుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 6:52 PM IST
|Updated : Dec 23, 2023, 8:24 PM IST
Children Protest to Open Anganwadi in Prakasham District: అంగన్వాడీని తెరిపించాలంటూ ప్రకాశం జిల్లాలో చిన్నారులు ప్లకార్డులు చేతపట్టి దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి. ఈ నిరసనలో చిన్నారుల వెంట తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొని అంగన్వాడీలకు న్యాయం చేయాలని కోరుకున్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలను తెరిపిస్తే, తమకు కూడా కుటుంబ పరంగా ఆందోళన తగ్గుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అంగన్వాడీలు మూతపడటంతో తమ పిల్లలకు పోషకాహారం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని హనుమంతునిపాడు మండల సచివాలయం ఎదుట, 'మా ఆంగన్వాడీ తెరిపించండి జగన్ మామయ్య' అంటూ చిన్నారులు ప్లకార్డులు చేతబూనిన ఘటన చోటు చేసుకుంది. గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తమ అంగన్వాడీలను ప్రభుత్వం తెరిపించాలని చిన్నారులు కోరారు. చిన్నారుల వెంట పలువురు గ్రామస్థులు, తల్లిదండ్రులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. అంగన్వాడీలు తెరవకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులతో సహా స్థానిక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీలను తెరిపించాలని కోరారు.