Oberoi Hotel Foundation విశాఖలో ఒబెరాయ్ హోటల్​కు భూమి పూజ..350 కోట్లతో నిర్మాణం - ap news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2023, 7:42 PM IST

Bhumi Puja for Oberoi Seven Star Hotel in Visakha : విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం బీచ్​లో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్​కు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరూధిని తో కలిసి జిల్లా కలెక్టర్ మల్లికార్జున భూమి పూజ చేశారు. ఈ హూటల్​ను 350 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ 65 రోజుల్లోనే విశాఖ జిల్లాలో అధాని సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్​తో పాటు ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మూడు ప్రాజెక్టులను 26 వేల కోట్ల రూపాయలతో నిర్మించనునున్నట్లు ఆయన తెలిపారు. ఒబెరాయ్ హోటల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 300 వ్యక్తిగత విల్లాలను నిర్మిస్తారని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పటాలను తీర్చిదిద్దుతారన్నారు. మరో 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్రత్యేక నగరంగా ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్ : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. 50 ఎకరాల్లో 250 కోట్ల రూపాయలతో నిర్మించే సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒబెరాయ్ గ్రూప్స్ ఎండీ విక్రం సమక్షంలో గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో మూడు ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి గండికోట నుంచే శిలాఫలకాలను ఆవిష్కరించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.