రేపల్లె నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి రాగాలు - సమన్వయకర్తల నియామకంపై పునారాలోచన చేయాలంటూ నివేదనలు - రేపల్లే నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 10:01 PM IST
|Updated : Dec 17, 2023, 6:15 AM IST
Bapatla District YSRCP Leaders Dissatisfaction: బాపట్ల జిల్లాలో నూతన వైసీపీ ఇంచార్జ్ నియామకంపై అసమ్మతి బయటపడుతోంది. ఎన్నికల్లో బరిలో నిలిచే వ్యక్తులనే సమన్వయకర్తలుగా అదిష్ఠానం నియామించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. అలా అయితేనే పార్టీ బలంగా ఉంటందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ నూతన సమన్వయకర్తగా ఈవూరు గణేశ్ అనే వ్యక్తిని పార్టీ నియమించింది. ఈ క్రమంలో రేపల్లె పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో బరిలో దిగే వ్యక్తులనే సమన్వయ కర్తలుగా నియమించాలని, దీనిపై పార్టీ మరోసారి పునరాలోచన చేయాలని నాయకులు కోరుతున్నారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు అంటూ అభ్యర్థులను పార్టీ మార్చడంపై, రేపల్లె మండల వైసీపీ నాయకుడు బొర్రా శ్రీనివాస రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన వారికే సముచిత స్థానం కల్పించాలని అన్నారు. ఇప్పుడు పార్టీ నియమించిన వ్యక్తి మంచివాడే కానీ, ఎన్నికల బరిలో ఒకరు సమన్వయ కర్తగా ఉండటం తగదని తెలిపారు. ఇలా నియమిస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే అధికమన్నారు. మోపిదేవి వెంకట రమణ రావుకు సీటు ఇస్తే సహకరిస్తామని, లేనిపక్షంలో తమ పని తాము చేసుకుంటామని వివరించారు. అదిష్ఠానం నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తామని వెల్లడించారు.