వైసీపీ పాలనలో అరాచకాలు - టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం : వరదరాజులు - cdp Varadarajulu Campaign
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:31 PM IST
Babu Surity Bhavishattu Gaurantee Program: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు పోవాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి (Ex MLA Varadarajulu Reddy) అన్నారు. వరద రాజులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈరోజు వైఎస్సాఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బాబు ష్యూరిటీ- భవిష్యత్త్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరదరాజులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
Former MLA Varadarajulu Campaign in Proddutur: వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని వరదరాజులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు పోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్త్ గ్యారెంటీ కార్యక్రమం (Babu Surity Bhavishattu Gaurantee Program)లో భాగంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ పథకాలు గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.