APCPS Employees Association on GPS: "ఓట్ ఫర్ ఓపీఎస్" అనే నినాదంతోనే ఉద్యోగులంతా ముందుకెళ్తాం: ఏపీసీపీఎస్ఈఏ - ap news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 10:43 AM IST
APCPS Employees Association on GPS : ప్రభుత్వం తీసుకు వచ్చిన జీపీఎస్ చట్టంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (APCPS Employees Association) స్పష్టం చేసింది. జీపీఎస్ (Guaranteed Pension Scheme) ను చట్టం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన అక్టోబరు 31 తేదీ సీపీఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినమని అసోసియేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీపీఎస్ పేరిట ఉద్యోగులను మోసం చేశారని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరోమారు పునరుద్ఘాటించింది.
CPS Employees Agitation on GPS : గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌లో అసలు పెన్షన్ గ్యారెంటీ లేకుండా చేసి జీవో ఇచ్చారని, టాప్ అప్ చేస్తామంటూ ప్రభుత్వం ఎప్పుడైనా దాన్ని ఆపేయ వచ్చని ఇంతకంటే మోసం మరొకటి లేదని సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆక్షేపించింది. ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉన్నట్టే ప్రతీ మోసానికి జవాబు కూడా ఉంటుందని ఏపీసీపీఎస్ఈఏ హెచ్చరించింది. ఓట్ ఫర్ ఓపీఎస్ (Vote for OPS) అనే నినాదంతోనే ఉద్యోగులు ముందుకెళ్తారని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది.