Andhra Pradesh Urdu Academy : ఏపీ ఉర్దు అకాడమీపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు: అబ్దుల్ ఖలీమ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 8:36 AM IST
Andhra Pradesh Urdu Academy : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ (Andhra Pradesh Skill Development Corporation) సహకారంతో ఏపీ ఉర్దు ఆకాడమీ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నామని ఏపీ ఉర్దు అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ ఖలీమ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ది సంస్థతో గత సంవత్సరం తాము ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 నైపుణ్యాభివృద్ది కేంద్రాలు దార్వా ముస్లిం యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. దాదాపు 3 నెలల పాటు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వివరించారు. 33 కెేంద్రల్లో శిక్షణ విజయవంతంగా జరుగుతోందని అయన తెలిపారు. అకాడమీని నాశనం చేయాలని కొందరు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులను రెచ్చగొట్టి అకాడమీపై విమర్శలు చేయిస్తున్నారని డైరెక్టర్ అబ్దుల్ ఖలీమ్ మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు పెంచలేదని అలాగే ఉద్యోగుల సంక్షేమాన్ని అకాడమీ పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.