AP Government Transfer 60 Deputy Collectors At A Time : ఏపీలో ఒకేసారి 60 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు బదిలీ... - ఏపీలో బదిలీలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 11:42 AM IST

AP Government Transfer 60 Deputy Collectors At A Time : రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలను బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 60 మంది డిప్యూటీ కలెక్టర్లను ఆర్డీవోలుగా నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పలాస, అమలాపురం, భీమవరం, ఉయ్యూరు, మచిలీపట్నం, కాకినాడ, చింతూరు, నర్సాపురం, తిరువూరు, కడప, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల ఆర్డీవోలను మారుస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవోల నుంచి బదిలీ అయిన కొందరు అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Transfer Of Deputy Collectors And RDO's In Andhrapradesh 2023 : ​ రాష్ట్ర వ్యాప్తంగా  డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకేసారి 60 మందిని బదిలీ చేశారు. వీరిలో పలువురు సీనియర్లు కాగా కొందరు కొత్తగా కొలువుల్లో చేరిన వారు ఉండటం విశేషం. అయితే రాష్ట్రంలో గత కొంత కాలంగా బదిలీలు జరుపుతున్నప్పటికీ. 19వ తేదీన (గురువారం) జరిగిన బదిలీలు ఎంతో వ్యూహాత్మంగా చేసినవని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల తరువాత ఉద్యోగ బదిలీలు అసాధ్యమని, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పెద్దఎత్తున బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.