సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై కఠిన చర్యలు - సీఎంపై పోస్టులు పెట్టేవారిపై నిఘా : సీఐడీ - సీఎం ఫ్యామిలీ పై అసభ్య పోస్టులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 5:58 PM IST
|Updated : Nov 8, 2023, 6:58 PM IST
AP CID Chief Sanjay On Fake Posts In Social Media: సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. అలాంటి వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని, వారి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా చర్యలు తీసుకుని పోస్టులు తొలగించామన్నారు. ఇటీవల న్యాయ వ్యవస్థని కించ పరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారని తెలిపారు.
అసభ్య పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం, కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీకి చెందిన కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించామని తెలిపారు. ఇతర దేశాల నుంచి అసభ్య పోస్టులు పెట్టే వారిపై ఎంబసీ వాళ్లతో మాట్లాడి చర్యలు చేపట్టామన్నారు. 202 సోషల్ మీడియా అకౌంట్స్ ను మానిటరింగ్ చేస్తున్నామన్నారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించామని సీఐడీ అధికారులు తెలిపారు. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2972 సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు.