After Four Years Boat Services Restart At Krishna River: నాలుగేళ్ల తరవాత.. కృష్ణా నదిలో లాంచీ సేవలు పునఃప్రారంభం - లాంచీసేవల ప్రారంభ వార్త
🎬 Watch Now: Feature Video
After Four Years Boat Service Restart At Krishna River: కృష్ణా నదిలో దాదాపు నాలుగేళ్ల తరవాత లాంచీ సేవలు తిరిగి ప్రారంభమైనవి. నాలుగు సంవత్సరాల క్రితం గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం తరవాత రాష్ట్రవ్యాప్తంగా లాంచీ సేవలను నిలిపివేశారు. అప్పటినుంచి మూతపడిన లాంచీ సేవలు తాజాగా ఆగస్టు 11న (శుక్రవారం) తిరిగి ప్రారంభం అయ్యాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పడవలు తిరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మధ్య లాంచీలు నడవనున్నాయి. నాలుగేళ్ల క్రితం మూతపడిన లాంచీ సేవలను శుక్రవారం తిరిగి పునరుద్ధరించాలని లాంచీల యజమాని అలపర్తి శ్రీనివాసరావు తెలిపారు. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం మధ్య ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పడవలు తిరుగుతాయని అన్నారు. తుళ్లూరు, ఇబ్రహీంపట్నం మధ్య గతంలో పండ్లు, కూరగాయలు, చేపల వ్యాపారం ఈ లాంచీల ద్వారానే జరిగేవి అని చెప్పారు.