అలా వెళ్లి ఇలా వచ్చాడు - అంతలోనే 17 లక్షలు మాయం - kadiri 17lakh rupees theft

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 3:40 PM IST

17 Lakh Rupees Theft in Satya Sai District: మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని మోసం చేసేందుకు దొంగలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక బ్యాంకుల వద్ద డబ్బులు విత్​ డ్రా చేసినా, డిపాజిట్​ చేసేందుకు వచ్చినా ఆయా ప్రాంతాల్లో వాళ్లు కాపు కాసి మరీ డబ్బులు ఎత్తుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. మనం వాహనాలకు తాళం వేశాం.. ఇలా వెళ్లి అలా వస్తాం కదా.. ఇంతలోనే ఏం జరుగుతుందో అనుకున్నామో.. ఇక అంతేసంగతులు.. మనం డబ్బుల్ని మరిచిపోవాల్సిందే.. అలాంటి ఘటనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగింది. 

Robbery Held in kadiri: కదిరికి చెందిన మహమ్మద్ అస్రాఫ్ అనే వ్యక్తి ఇటీవలే తన ఆస్తిని విక్రయించాడు. ఆస్తిని అమ్మగా వచ్చిన రూ.18 లక్షలను బ్యాంకులో జమ చేసేందుకు బుధవారం  మిత్రులతో కలిసి వెళ్లారు. రూ.లక్ష  క్యాష్ డిపాజిట్ మిషన్​లో(Cash Deposit Machine - CDM) వేయడానికి తీసి.. మిగతా సొమ్మును ద్విచక్ర వాహనం డిక్కీలో ఉంచారు. ఇదంతా ఓ కేటుగాడు దూరం నుంచి పరిశీలించాడు. బండికి తాళం వేసుకొని సీడీఎం మిషన్ వద్దకు మిత్రులతో వెళ్లాడు అస్రాఫ్. వెంటనే ఆ వ్యక్తి ద్విచక్ర వాహనం వద్దకు వచ్చి డిక్కీ తాళాలను తెరచి..  రూ.17 లక్షల ఎత్తుకెళ్లాడు. బ్యాంకులో పని ముగించుకుని బయటికి వచ్చిన మహమ్మద్ అస్రాఫ్ డిక్కీ తాళం తీసి చూడగా అవాక్కయ్యాడు  వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ద్విచక్ర వాహనంలో ఉంచిన నగదు గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకెళ్లిన దృశ్యాలను సీసీ టీవీలో గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.