Sarpanches Association: పంచాయతీలకు నిధుల విడుదల చేయకపోతే.. 3న 'చలో తాడేపల్లి' - Sarpanches Association

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2023, 10:37 PM IST

Sarpanches Association: కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పంచాయతీలకు విడుదల చేయలేదని సర్పంచుల సంఘం మండిపడింది. దీనిని నిరసిస్తూ జులై మూడో తేదీన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నట్లు ప్రకటించింది. 2022-23లో కేంద్రం నుంచి రెండు వేల పది కోట్ల రూపాయలు రావాల్సి ఉందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిసి తమ పరిస్థితిని వివరించామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సమకూర్చకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సమకూర్చలేదని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం.. మే నెలలో 988.06 కోట్ల రూపాయలను రెండు విడతలుగా రాష్ట్రానికి పంపించినట్లు తెలిపారు. ఈ నిధుల కోసం ముఖ్యమంత్రి జగన్​ను కలిసి తమ గోడు వివరించినా.. ఇంతవరకు నిధులు రానందునే ఆందోళనకు దిగుతున్నట్లు చెప్పారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.