అమ్మాయిలు అదరహో..! - Miss Diva 2020 Auditions Date, Venue, City
🎬 Watch Now: Feature Video
'లివా మిస్ దివా-2020' అందాల పోటీల కోసం భాగ్యనగరంలో అమ్మాయిలు పోటీపడ్డారు. గచ్చిబౌలిలో నిర్వహించిన అడిషన్స్‌లో ర్యాంప్‌పై సొగసైన నడకతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో అదరహో అనిపించారు. విజేతలుగా 9 మంది ఎంపికయ్యారు. వీరంతా జనవరిలో నిర్వహించే తుది ఆడిషన్స్ ముంబయిలో పాల్గొననున్నారు. హైదరాబాద్ తరువాత లక్నో, చెన్నై, ఇండోర్, కోల్‌కతా, పుణె, జైపూర్, చండీగఢ్, దిల్లీ నగరాల్లో ఆడిషన్స్ ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.