How Much Walking In A Week To Lose Weight : మన రోజువారి జీవితంలో నడక ఒక భాగం. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వాకింగ్ సులువైన వ్యాయామం. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం ద్వారా అదనపు క్యాలరీలు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తక్కువ సమయంలోనే కరిగించవచ్చని చెబుతుంటారు నిపుణులు. ఇదే విషయమై సాధారణ ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. చాలా మంది వీలున్నప్పుడల్లా కాళ్లకు పని చెబుతున్నారు. రోజుకు ఎంత దూరం నడవాలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్మార్ట్‌వాచ్‌లోని స్టెప్ కౌంటర్‌ను ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు.
ఇంతకీ ఎంతదూరం నడవాలి?
How Much Should You Walk In A Week : బరువు తగ్గాలంటే ఎంత దూరం నడవాలనేదానిపై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ మేయో క్లినిక్ ఓ అధ్యయనం చేసింది. నిత్యం (వారంలో ఐదు రోజులు) అరగంట పాటు వేగంగా నడవడాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటే రోజుకు 150 క్యాలరీలు కరిగించవచ్చని తేల్చింది. వేగం, దూరం పెంచితే ఫలితం మరింత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. మరోవైపు, వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని అమెరికా ఆరోగ్య శాఖ తమ పౌరుల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
నడక వల్ల కలిగే లాభాలివే!
వాకింగ్ మీ కండరాలను దృఢంగా మార్చుతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. నడక వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్‌తో ఒత్తిడి, భయం, కోపం వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండొచ్చు. శరీరం ఫిట్‌గా ఉంటే గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు దరిచేరవు.
How Much Should I Walk In A Week To Lose Weight : మనిషికి రోజుకు ఎన్ని క్యాలరీలు అవసరం అనేది వారి వయసు, ఎత్తు, బరువు, చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. శారీరకంగా కష్టపడేవారిలో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. వారు త్వరగా బరువు తగ్గుతారు. మిగిలినవారు రోజూ వాకింగ్ చేయడమే ఉత్తమ మార్గం. వారానికి 4 నుంచి 5 మైళ్లు దూరం నడవడం వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మన దరిచేరకుండా ఉంటాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు.
వేగంగా నడిస్తే ఇన్ని లాభాలా?.. గుండె, క్యాన్సర్, బీపీ రోగాలకు చెక్!