కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ ఎదుట వైకాపా కార్యకర్తలు ఆందోళన చేశారు. నిన్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గంగిరెడ్డిపల్లిలో జరిగిన తెదేపా, వైకాపా ఘర్షణలో ఎస్ఐ పై కారంపొడి చల్లారన్న ఆరోపణలతో... వైకాపా ఏజెంట్ లక్ష్మీరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై.. రఘరాంరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు సర్దిచెప్పినా వినకుండా స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఎస్పీ వద్దనే తెల్చుకుంటామని రఘురామిరెడ్డి కార్యకర్తలతో కలిసి కడపకు వెళ్లారు.
బ్రహ్మంగారిమఠం వద్ద వైకాపా కార్యకర్తల ఆందోళన - police station
పోలింగ్ సందర్భంగా అదుపులోకి తీసుకున్న కార్యకర్తను చూపించాలంటూ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్ ఎదుట వైకాపా నేతలు ధర్నాకు దిగారు. తమ కార్యకర్తలను ఇష్టానుసారంగా కొట్టారంటూ వైకాపా అభ్యర్థి రఘురాం రెడ్డి ఆరోపించారు.