Yogi Vemana University: పెరిగిన మెస్ బిల్లులు తగ్గించాలని కోరుతూ ఈ రోజు కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలోని వసతి గృహం ఎదుట విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. మెస్ బిల్లులు నెలకు మూడు వేల రూపాయలు వస్తుందని వసతి గృహ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహ అభివృద్ధి కోసం ప్రతి నెల రూ.250 ఇస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు వసతిగృహంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
నెలకు మూడు వేల రూపాయలు డబ్బులు చెల్లించాలంటే ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోయారు. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని బిల్లులు తగ్గించాలని విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సిద్ధాపురం చెరువుకు గండి.. ఆందోళనలో అన్నదాతలు