ETV Bharat / state

నందం సుబ్బయ్య హత్య వైకాపా పనే: శ్రీనివాసులు రెడ్డి - proddatur news today

తెదేపా నేత నందం సుబ్బయ్యది ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. ఎఫ్​ఐఆర్​లో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు.

srinivasulu reddy
srinivasulu reddy
author img

By

Published : Dec 30, 2020, 2:14 PM IST

మీడియాతో శ్రీనివాసులు రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత నందం సుబ్బయ్యను హత్య చేసింది ప్రత్యర్థులే అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. బుధవారం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు చేస్తున్న అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తున్నందుకే సుబ్బయ్యను హత్య చేశారని అన్నారు. తెదేపా కార్యకర్తలను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు.

తన భర్త హత్యకు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి కారణమని అపరాజిత ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ఎఫ్​ఐఆర్​లో వారి పేర్లను చేర్చితేనే సుబ్బయ్య అంత్యక్రియలు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రొద్దుటూరుకి వచ్చి సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి

కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో నరికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.