మింగడానికి మెతుకు లేదు... మీసాలకు సంపంగి నూనె అన్న చందంగా వైకాపా ప్రభుత్వ వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు సకాలంలో చెల్లించట్లేదని దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సి ఉండగా... జులై నెలలో 10న, ఆగస్టులో 5వ తేదీన జీతాలు ఇచ్చారన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చి... ఇంకా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రకటనలకు 101 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సమంజసమా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. 52 కోట్ల రూపాయల ప్రకటనలు కేవలం సొంత పత్రికకు ఇవ్వడం ధర్మమా అని ఓ ప్రకటనలో నిలదీశారు.
ఇదీ చదవండి
అతిధి గృహ నిర్మాణానికి చర్యలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశా: ఆర్ఆర్ఆర్