కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక(election campaign at badvel)ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు అక్కడే మకాం వేసి ఓట్ల వేటలో పడ్డారు. వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధ గెలుపు కోసం.. మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం(bjp and ycp campaign at badvel) చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని చెబుతున్నారు. భాజపాకు స్థానికంగా నాయకులు, కార్యకర్తలు లేకపోవడం వల్ల తెలుగుదేశం నేతలను తెచ్చుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన: సోము వీర్రాజు
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బద్వేలుకు కేంద్రం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందనే దానిపై కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నామని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వివరించారు. మార్పు కోసం ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని మిత్రపక్షం జనసేనతో కలిసి ఓటర్లను అభ్యర్థించారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్‌ను పాటించాలి..
ఉపఎన్నిక పూర్తయ్యే వరకూ బద్వేలుతో పాటు జిల్లాలో ఎలాంటి రాజకీయ కార్యక్రమమూ చేపట్టవద్దని ఈసీ(ec on badvel bypoll) ఆదేశాలిచ్చింది. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే వాటి ఖర్చును ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల కోడ్‌తో పాటు కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఇదీ చదవండి..Badvel By-Poll: బద్వేలులో ఉప ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన కె. విజయానంద్