కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. కర్నూలు కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట నుంచి కాలువలోకి నీరు విడుదల చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి కేసీ కాలువ అధికారులు రాజోలి ఆనకట్ట వద్దకు చేరుకొని పూజలు చేసి కాలువలకు నీరు విడుదల చేశారు. రాజోలి ఆనకట్ట వద్ద 3500 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. తొలివిడతగా కేసీ కాలువలోకి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అంచలంచలుగా కాలువలోకి నీటి ప్రవాహాన్ని పెంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి:ఏమైందో..ఏమో..గోశాలలో 100 ఆవులు మృతి!