కడప జిల్లా పులివెందుల పౌరసరఫరాల గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజాపంపిణీ బియ్యాన్ని కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారన్న సమాచారంతో... విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. సోదాలో భాగంగా ఒక మినీ లారీని గుర్తించామని...విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: కడప రవాణా కార్యాలయంపై అనిశా దాడులు