కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్య కళావతి పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. జిల్లాకు చెందిన మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆమె అన్నారు. ఆపద సమయంలో పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆమె అభినందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండి.. వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి..
ఎండల్లో వానలు.. సేద తీరిన జనాలు