రాయచోటిలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు వైభవంగా ఆరంభమయ్యాయి. ముందుగా ఆలయ ఈశాన్యంలోని చేదు బావికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదురుగా ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. తర్వాత నంది మఠం సిద్ధాంతి ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు మహరాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కన్నడ భక్తులు వారి వాయిద్యాలతో... చేసిన విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండీ.. హోరాహోరీ పోరులో బెజవాడ పీఠం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం